మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః ।
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే ।। 16 ।।

మనః-ప్రసాదః — ఆలోచనలో ప్రశాంతత; సౌమ్యత్వం — సౌమ్యముగా ఉండటము; మౌనమ్ — మౌనము; ఆత్మ-వినిగ్రహః — ఆత్మ నిగ్రహము; భావ-సంశుద్ధిః — భావములో పవిత్రత; ఇతి — ఈ విధముగా; ఏతత్ — ఇవన్నీ; తపః — తపస్సు; మానసమ్ — మనస్సు యొక్క; ఉచ్యతే — చెప్పబడినవి.

అనువాదం

BG 17.16: ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ-నిగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత - ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడినాయి.

వ్యాఖ్యానం

మనస్సు యొక్క తపస్సు అనేది శరీరము మరియు వాక్కు యొక్క తపస్సుల కంటే ఉన్నతమైనది. ఎందుకంటే, మనస్సుని గెలువ గలిగితే, శరీరము మరియు వాక్కు వాటంతట అవే స్వాధీనములోనికి వస్తాయి. కానీ, శరీరము, వాక్కులను గెలిస్తే మనస్సు ఖచ్చితంగా నియంత్రణ లోనికి వచ్చినట్టు చెప్పలేము. నిజానికి, మనస్సు యొక్క స్థితియే వ్యక్తి యొక్క స్థాయి/దృక్పథమును నిర్ణయిస్తుంది. శ్రీ కృష్ణుడు 6.5వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు, ‘నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము, అంతేకాని మరింత పతనం కావద్దు, ఎందుకంటే మనస్సు మన మిత్రుడుగా ఉండవచ్చు లేదా మన శత్రువుగా అయిపోవచ్చు.’

మనస్సుని ఒక పూదోటతో పోల్చవచ్చు, దానిని తెలివిగా సాగు చేసుకోవచ్చు లేదా దాన్ని అలా విశృంఖలంగా వదిలేయచ్చు. పండ్లు, పువ్వులు మరియు కూరగాయలు పండించుకోవటానికి తోటమాలులు తమ నేలని సాగు చేస్తారు. అదే సమయంలో, వారు కలుపుమొక్కలు పెరగకుండా కూడా జాగ్రత్త పడతారు. అదే విధముగా, మన స్వంత మనస్సుని ఉన్నత తలంపులతో, పవిత్రమైన భావాలతో నింపుకుంటూ, అదే సమయంలో ప్రతికూల, వినాశకర తలంపులను ఏరిపారేస్తూ ఉండాలి. ఒకవేళ మనము క్రోధపూరిత, ద్వేశపూరిత, దూషణభరిత, ప్రతీకారేచ్ఛతో కూడిన, విమర్శక, మరియు నిందించే తలంపులను మన మనస్సులో ఉండనిస్తే, అవి మన వ్యక్తిత్వం పైన తీవ్ర వినాశకర ప్రభావం చూపుతాయి. మనస్సుని నియంత్రించటం నేర్చుకుని, దానిని క్రోధము, ద్వేషము, అయిష్టత వంటి వాటి నుండి ప్రభావితం కాకుండా చూసుకోనంతవరకూ, మన మనస్సు నుండి ప్రయోజనకారక పని ఏదీ మనకు లభించదు. భగవంతుని కృప మన హృదయములలో వ్యక్తమవ్వటాన్ని అడ్డుకునే కలుపుమొక్కలు ఇవే.

జనులు, వారి తలంపులు రహస్యమైనవని మరియు అవి వారి మనస్సులోనే ఉంటూ ఇతరులకు ఏమాత్రం తెలియనివి కాబట్టి వాటికి ఎటువంటి బాహ్యమైన పరిణామం ఉండదు అని అనుకుంటారు. ఈ ఆలోచనలే వారి యొక్క అంతర్గత స్వభావాన్ని మరియు బాహ్య వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మనం ఎవరినైనా చూసినప్పుడు, ‘ఆయన చాలా మంచివాడిగా, నమ్మకస్తుడిగా ఉన్నట్టు అనిపిస్తున్నది’ అని అనుకుంటాము. ఇంకొక వ్యక్తి పట్ల, ‘ఆమె చాలా ప్రమాదకారిగా, మోసగత్తె లాగా అగుపిస్తున్నది, ఆమె నుండి దూరంగా ఉండు’ అని మనం అంటాము. ప్రతి ఒక్కరి విషయంలో కూడా, వారి వారి ఆలోచనలు/తలంపులే వారి స్వరూపాన్ని నిర్ణయిస్తాయి. రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ ఈ విధంగా అన్నాడు: ‘మన చూపులలోనే, మన నవ్వులోనే, మన అభివాదనలోనే, మన చేతి పట్టు లోనే, అంతా తెలిసి పోతుంది. మనం చేసుకున్న పాపం మనలను అంటుకునే ఉంటుంది, మంచి వ్యక్తిత్వాన్ని కళంకితం చేస్తుంది. మనలను ఎందుకు నమ్మరో తెలియదు. దుష్టగుణము కళ్ళను కప్పివేస్తుంది, బుగ్గలను తగ్గిస్తుంది, ముక్కును నొక్కుతుంది, మరియు, ‘ఓ మూర్ఖుడా, మూర్ఖుడా!’ అని రాజు గారి నుదుటిపై వ్రాస్తుంది తలంపులను వ్యక్తిత్వంతో జోడిస్తూ ఇంకొక గొప్ప లోకోక్తి ఉన్నది:

నీ ఆలోచనలను గమనించు, అవే నీ మాటలు అవుతాయి (Watch your thoughts, for they become words.)
నీ మాటలను గమనించు, అవే నీవు చేసే పనులు అవుతాయి (Watch your words, for they become actions.)
నీవు చేసే పనులను గమనించు, అవే నీ అలవాట్లు అవుతాయి (Watch your actions, for they become habits.)
నీ అలవాట్లను గమనించు, అవే నీ వ్యక్తిత్వం అవుతాయి (Watch your habits, for they become character.)
నీ వ్యక్తిత్వాన్ని గమనించు, అదే నీ భవితవ్యము అవుతుంది (Watch your character, for it becomes your destiny.)

మన మనస్సులో ఉన్న ప్రతి ఒక్క ప్రతికూల/ద్వేషభావ ఆలోచనతో మనం మనలకే హాని చేకూర్చుకుంటున్నాము, అని మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం. అదే సమయంలో, ప్రతిఒక్క మంచి ఆలోచనతో మనలను మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాము. హెన్రీ వాన్ డైక్ తన కావ్యం ‘థాట్స్ ఆర్ థింగ్స్’ (Thoughts are things) లో దీనిని చాలా స్పష్టముగా వివరించాడు:

I hold it true that thoughts are things;
They’re endowed with bodies and breath and wings
That which we call our secret thought
Speeds forth to earth’s remotest spot,
Leaving its blessings or its woes,
Like tracks behind as it goes.
We build our future, thought by thought.
For good or ill, yet know it not,
Choose, then, thy destiny and wait,
For love brings love, and hate brings hate.

మనలో ఉండే ప్రతి ఒక్క తలంపుకి దాని పరిణామాలు ఉంటాయి, ఒక్కొక్క ఆలోచనతో మనం మన భవిష్యత్తుని ఎంచుకుంటాము. ఈ కారణం చేత, మనస్సుని చెడు/ప్రతికూల తలంపుల నుండి దూరంగా చేస్తూ, దానిని సద్భావనతో ఉన్న తలంపులలో ఉంచటం అనేది, మనస్సు యొక్క తపస్సు అని చెప్పబడుతుంది.

Bookmark this Verse

Sign in to save your favorite verses.

Add a Note
Swami Mukundananda
17. శ్రద్ధా త్రయ విభాగ యోగము

ఏ శ్లోకానికైనా వెంటనే వెళ్లండి

మీరు వెతుకుతున్న జ్ఞానానికి నేరుగా వెళ్లండి

Book with feather

మీ స్వంత గీతను పొందండి

Bhagavad Gita — The Song of God భగవద్గీత
The Song of God
Order Now
Bhagavad Gita for Everyday Living Bhagavad Gita for
Everyday Living
Order Now

మాతో అనుసంధానంలో ఉండండి!

రోజు శ్లోకం

పవిత్ర భగవద్గీత యొక్క శాశ్వత ప్రేరణాత్మక జ్ఞానంతో మీ రోజును ప్రారంభించండి; అది నేరుగా మీ ఇమెయిల్‌కు చేరుతుంది!

"భగవద్గీత - రోజు శ్లోకం" సభ్యత్వం పొందినందుకు ధన్యవాదాలు!

Get Your Own Gita
Bhagavad Gita — The Song of God

భగవద్గీత
The Song of God

Order Now
Bhagavad Gita for Everyday Living

Bhagavad Gita for Everyday Living

Order Now
What's New in
Holy Bhagavad Gita
  • Redesigned home, verse, and chapters pages
  • Personal accounts — sign in with email, phone, or Google
  • Bookmark verses and save notes on any verse
  • Track your reading progress across all 18 chapters
  • Quick-jump to any verse
  • Full site now available in all 6 languages
  • Overall visual polish and consistency